గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వారి పై కేసులు పెట్టడం చాలా బాధాకరమని చిన్న శంకరంపేట మండల అధ్యక్షులు రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, గిరిజనుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని ఆశించి గెలిపించిన గిరిజనులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని వ్యాఖ్యానించారు. కొంతమంది లగచర్ల బాదిత గిరిజనుల పరామర్శ కోసం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసుల ముందస్తు అరెస్టు చేశారు.
ఈ అరెస్టులకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, శాలిపేట మాజీ సర్పంచ్ పోచయ్యలు మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ, “గిరిజనుల భూములను లాక్కోకుండా ఫార్మా కంపెనీ వేసేందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అయినా, ఈ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు.
గిరిజనుల భూములు తీసుకునే క్రమంలో ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా, ప్రభుత్వం ఫార్మా కంపెనీని స్థాపించాలని ప్రయత్నిస్తోందని వారు అన్నారు. అలాగే, ఫార్మా కంపెనీని వేయకూడదని గిరిజనులు అడగగా, వారిపై కేసులు పెట్టి జైలుకు పంపడం సమంజసం కాదని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, మాజీ సర్పంచ్ రమేష్ నాయక్, సుధాకర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, మోహన్, నరేష్ మరియు ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
