రైతులు పంట కోతలు పూర్తయిన తర్వాత రామాయంపేట మండలంలోని పలు గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ కోత కోసిన పొలాలను ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వరి పంటలో వరి కోత కోసిన తర్వాత మిగిలిన అవశేషాలను అక్కడక్కడ తగలబెట్టడం వలన భూమిలో ఉన్న ఉపయోగకరమైన మరియు పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు చనిపోవడమే కాకుండా సేంద్రియ కర్బనం కూడా దెబ్బతింటుంది.ఈ విధంగా తగలబెట్టడం ద్వారా వాతావరణ కాలుష్యం పెరగడంతోపాటు భూమి యొక్క భౌతిక స్థితి కూడా దెబ్బతింటుంది. నీటిని నిలుపుకునే శక్తిని కోల్పోతుంది కావున రైతులు పంట అవశేషాలు తగలబెట్టకుండ భూమిలో కలియదున్నాలన్నారుఇలా చేయటం వలన భూమిలొ సేంద్రియ కర్బన పదార్థం పెరిగి నేల గుళ్ళబారుతుందని. నేలలో సేంద్రియ కర్బన పదార్థం పెరగడం ద్వారా పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు వాన పాముల సంతతి పెరుగుతుందని తద్వారా పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందికాబట్టి నీటిని నిలుపుకునే శక్తిని పెరగడం ద్వారా రైతులు తక్కువసార్లు పంటకు నీటిని ఇవ్వవచ్చని మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ తెలిపారు
రైతులకు పంట అవశేషాలపై రాజ్ నారాయణ సూచనలు
Mandal Agricultural Officer Raj Narayana advises farmers to avoid burning crop residues, emphasizing the environmental and soil health benefits. He highlights the importance of maintaining soil fertility for better crop yield.
