చింతలపూడి మండలంలో నాటు సారాయి వ్యాపారంపై దాడులు

A raid was conducted in Chintalapudi Mandal, where 1400 liters of illicit liquor and 40 liters of illicit arrack were seized. The suspects were arrested A raid was conducted in Chintalapudi Mandal, where 1400 liters of illicit liquor and 40 liters of illicit arrack were seized. The suspects were arrested

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లో 21 వ తేదీన డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (DPEO) ఏలూరు జిల్లా వారి ఆదేశాలు ప్రకారం చింతలపూడి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిది లో గల చింతలపూడి మండలం కంచనగూడెం గ్రామంలో శివారు అటవీ ప్రాంతము లో నాటు సారాయి స్థావరాలు పై దాడులు నిర్వహించగా కంచనగూడెం గ్రామము కు చెందిన శాక చంద్రరావు అను వ్యక్తి నుండి (40) లీటర్ల నాటు సారాయి ను స్వాధీన పరుచుకొని, మరియు 7 ప్లాస్టిక్ డ్రమ్ లలో 200 లీటర్ల పరిమాణము లలో ఉన్న మొత్తం (1400) లీటర్లు పులిసిన బెల్లపు ఊటను పూర్తిగా ధ్వంసం చేసి సాక చంద్రరావు ను అదుపు లో తీసుకుని స్థానిక ఎక్సైజ్ స్టేషన్ చింతలపూడి నందు కేసు నమోదు చేసి మరియు మేడూరి బన్నీ అను వ్యక్తి పై పరారీ కేసు నమోదు చేయడమైనది.
అలాగే చింతలపూడి మండలం, శివపురం గ్రామంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL) పాత కేసు లో ముద్దయి ను గుత్తా వేంకటేశ్వర రావు అయిన ను 129 BNSS చట్టం ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తహసీల్దార్ చింతలపూడి వారి ఎదుట హాజరు పరచి బైండ్ ఓవర్ నమోదు చేయడమైనది ఈ దాడులలో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ ఎస్.ఐ. అబ్దుల్ ఖలీల్, ESTF ఏలూరు ఎస్.ఐ యం.డి.ఆరిఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు అని ఎక్సైజ్ సి.ఐ పి.అశోక్ తెలిపినారు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *