టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. గత నెల మార్చి 24న పాప పుట్టిన సంగతి అభిమానులందరికీ తెలిసినదే. అప్పటి నుంచి చిన్నారికి ఏ పేరు పెడతారా అనే ఉత్కంఠ నెలకొంది.
ఈ రోజు (ఏప్రిల్ 18) తన పుట్టినరోజు సందర్భంగా రాహుల్ ఓ మధురమైన సమాచారం పంచుకున్నారు. తన భార్య అతియా, పాపతో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ ఫోటోకి “మా పాప, మా సర్వస్వం. ఇవారా – దేవుడిచ్చిన వరం” అని క్యాప్షన్ ఇచ్చారు.
‘ఇవారా’ అనే పేరుకు గల అర్థం ‘దేవుని బహుమతి’ అన్నది. ఈ పేరు అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. రాహుల్ పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినీ, క్రీడా రంగాల ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ పడుతోంది.
ప్రస్తుతం రాహుల్ ఐపీఎల్ బిజీలో ఉన్నా, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ మధురమైన క్షణాన్ని అభిమానులతో పంచుకోవడం ప్రత్యేకం. చిన్నారికి పేరుపెట్టిన అనంతరం రాహుల్, అతియా కుటుంబాల్లో మరోసారి హర్షాతిరేకం నెలకొంది.
