పుష్ప-2 ట్రైలర్ లాంచ్… రాజమౌళి స్పందన

The grand launch of Pushpa-2 trailer in Patna received a positive response. Director Rajamouli shared his excitement for the film's release on December 5th, with thrilling dialogues captivating fans. The grand launch of Pushpa-2 trailer in Patna received a positive response. Director Rajamouli shared his excitement for the film's release on December 5th, with thrilling dialogues captivating fans.

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప-2 ది రూల్’ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం పాట్నాలో గ్రాండ్‌గా నిర్వహించారు.

సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేసిన ఈ ట్రైలర్‌కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమా అంచనాలు మరింత పెంచిన ఈ ట్రైలర్‌ను చూసి అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి కూడా పుష్ప-2 ట్రైలర్‌పై స్పందించారు. ‘‘పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది!! దేశమంతటా విస్తరిస్తోంది!! డిసెంబర్ 5న పేలుతుంది!!’’ అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా… ఇంటర్నేషనలు…!’ మరియు ‘పుష్ప అంటే ఫైరు కాదు… వైల్డ్ ఫైర్’ వంటి డైలాగులతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2021లో విడుదలై విజయాన్ని సాధించిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *