ఎమ్మిగనూరు టౌన్ సీఐ సుదర్శన్ రెడ్డి బదిలీని నిరసిస్తూ శనివారం ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక సోమప్ప సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిజాయితీగా విధులు నిర్వహించి పట్టణంలో అల్లరి మూకలను అణచివేసి శాంతి భద్రతలను కాపాడారన్నారు. ఆయనను మూడు నెలలకే బదిలీ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. బదిలీని వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు.
ఎమ్మిగనూరు సీఐ బదిలీకి వ్యతిరేకంగా రాస్తారోకో ర్యాలీ
				Citizens and student unions held a protest rally against the transfer of Emmiganur CI Sudarshan Reddy, demanding that the transfer be stopped immediately.
			