కామారెడ్డి జిల్లాలో రైతు భరోసా కోసం ధర్నా

In Kamareddy, BRS party leaders burned an effigy demanding immediate financial support for farmers under the Raitu Bharosa scheme, criticizing the Congress government. In Kamareddy, BRS party leaders burned an effigy demanding immediate financial support for farmers under the Raitu Bharosa scheme, criticizing the Congress government.

రైతు భరోసా రైతులకు వెంటనే ఇవ్వాలని , రైతులకు రుణమాఫీ చేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజంసాగర్ చౌరస్తాలో BRS పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి , TSPSC రాష్ట్ర మాజీ డైరెక్టర్ సుమిత్ర ఆనంద్ , కుంభాలరవి యాదవ్ , గోపి గౌడ్ , యూత్ విభాగం అధ్యక్షులు భాను ప్రసాద్ మాట్లాడుతూ KTR ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం , కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజం సాగర్ చౌరస్తాలో ధర్నా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజులలో రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి 15వేల రూపాయలు ఇస్తానని చెప్పి 10 నెలలు గడుస్తున్న ఇంతవరకు రైతులకు రైతు భరోసా ఇవ్వడం లేదని అన్నారు. వెంటనే రైతు ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత మూడు నెలల్లో వేస్తామని చెప్పారని,ఆ తర్వాత దసరా పండగ రోజు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగిందని ,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అన్ని అబద్ధాలు మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని. కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు ప్రజలు గుర్తిస్తున్నారని , ప్రజలే కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే బుద్ధి చెప్తారని అన్నారు, ఇప్పటికైనా వెంటనే రైతులకు వర్షాకాలపు రైతు భరోసా కింద ఎకరానికి 15 వేల రూపాయలు ఇవ్వాలని లేకపోతే తెలంగాణ రాష్ట్ర మొత్తం పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు చేయడం జరుగుతుందని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్స్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *