ఇటీవల మధుమేహం రోగుల సంఖ్య పెరుగుతోంది. అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం ఉన్నవారిలో త్వరలో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఇలాంటి వారికి ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతూ ఉంటుంది. తగిన ఇన్సులిన్ ఉత్పత్తి జరిగినా, రక్తంలో షుగర్ నియంత్రణలో ఉండదు. నిపుణుల ప్రకారం, కొన్ని ప్రొటీన్ ఆహారాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచి, షుగర్ స్థాయిని మెరుగుపరచగలవు.
ఎండు బీన్స్, శనగలు వంటి పప్పుదినుసులు అధిక ఫైబర్, ప్రొటీన్లు కలిగి ఉంటాయి. ఒక కప్పు ఎండు బీన్స్‌లో 15 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో షుగర్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. శనగలు రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా కలిగి ఉండటంతో ఆహారం జీర్ణమయ్యే వేగాన్ని తగ్గిస్తుంది.
చియా సీడ్స్‌లో ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ నిల్వలను నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే, టోఫు పనీర్ శరీరంలో కండరాల పనితీరును మెరుగుపరిచి షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది.
క్వినోవాలో అన్ని రకాల అమైనో యాసిడ్లు ఉండటంతో పూర్తి స్థాయి ప్రొటీన్ ఫుడ్‌గా వ్యవహరిస్తుంది. దీంట్లో ఉన్న ఫైబర్, ప్రొటీన్లు షుగర్ స్థాయిని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఈ ఆహారాలను తరచుగా తీసుకుంటే మధుమేహం ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.