సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ప్రియమణి, పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ ఇచ్చి, మంచి అవకాశాలతో దూసుకుపోతుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంటోంది. హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్ లో నటిస్తూ, త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కానుంది. ఈ సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
దర్శకుడు మణిరత్నంపై ప్రియమణి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “మణిరత్నం సినిమాలో నటించడమే గొప్ప అదృష్టం” అని పేర్కొన్నారు. ఆమె మాటల్లో, “మణిరత్నం సినిమాలో అవకాశం వస్తే, ఏ హీరోయిన్ కూడా దాన్ని వదులుకోదు” అని చెప్పింది. “ఆయన నుంచి ఫోన్ వస్తే, కమిట్ అయిన వేరే సినిమాలను కూడా వదులుకోవడానికి నేను సిద్ధమే” అని ప్రియమణి వ్యాఖ్యానించారు.
ప్రియమణి చెప్పినట్లుగా, “మణిరత్నం హీరోయిన్లకు ఫేవరేట్ డైరెక్టర్. ఆయన వారిని తెరపై ఎంతో అందంగా చూపిస్తారు” అని తెలిపింది. దక్షిణాది ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరని ఆమె అభిప్రాయపడ్డారు. తనకోసం ఆయన సినిమా అవకాశం వస్తే, అది అంగీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆమె చెప్పింది.
ప్రియమణి మాట్లాడుతూ, “మణిరత్నంతో పనిచేయడం ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ఆయనతో సినిమాలు చేయడం చాలా గొప్ప అనుభవం” అని ఆమె వెల్లడించారు.
