హెల్మెట్ ధరించడం వల్ల జుత్తు రాలిపోకూడదంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. హెల్మెట్ లోపల చెమట పెరిగి, వెంట్రుకలు రాలిపోవచ్చు. దీని నుంచి రక్షణ పొందడానికి కాటన్ వస్త్రాన్ని తలకు కప్పుకుని హెల్మెట్ ధరించడం మంచిది. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా చెమటను పీల్చుకుంటుంది.
తడిగా ఉన్న జుత్తుతో హెల్మెట్ ధరించడం వల్ల వెంట్రుకలు తెగిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. అందుకే తలస్నానం చేసిన తర్వాత జుత్తును పూర్తిగా ఆరబెట్టుకుని హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే హెల్మెట్‌ను తరచూ శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా పెరగకుండా ఉంటాయి.
హెల్మెట్ ఎక్కువసేపు ఉపయోగించే వారు తలకు నూనె రాసుకోవడం, తగినంత మర్దన చేయడం మంచిది. జుత్తు కుదుళ్ల వరకు శుభ్రం చేసుకోవడం వల్ల మురికి పోయి, జుత్తు ఆరోగ్యంగా ఉంటుంది. తగిన షాంపూ, కండిషనర్ వాడితే జుత్తు పెళుసు కాకుండా, రాలిపోకుండా ఉంటుంది.
హెల్మెట్ ధరిస్తున్నప్పుడు తలకు తేమ అవసరం. మంచి హెయిర్ ఆయిల్, కండిషనర్ వాడడం వల్ల జుత్తు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. ఇవన్నీ పాటిస్తే హెల్మెట్ ధరించినా జుత్తు రాలిపోకుండా ఉండవచ్చు.