ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయి గూడెం లో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నవంబర్ రెండవ తేదీ నుంచి జరిగే కార్తీక మాస ఉత్సవాలు సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కార్య నిర్వహణ అధికారి పీవీ చందన తెలిపారు. కార్తీక మాసంలో జరిగే మాస ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు కాబట్టి పోలీసు శాఖ రెవెన్యూ శాఖ ఆర్డబ్ల్యూఎస్ వైద్య ఆరోగ్యశాఖ రోడ్లు భవనాల శాఖ విద్యుత్ శాఖ మున్సిపాలిటీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల అధికారులు భక్తులకు సేవలు అందించేందుకు అదేవిధంగా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అసాంఘిక శక్తులకు తావియ్యకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.
కార్తీక మాస ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు
 Preparations are in full swing for the Kartika Masam celebrations at Sri Maddi Anjaneya Swami Temple. Officials ensure smooth services for devotees to avoid any inconveniences.
				Preparations are in full swing for the Kartika Masam celebrations at Sri Maddi Anjaneya Swami Temple. Officials ensure smooth services for devotees to avoid any inconveniences.