సినీ నటుడు ప్రభాస్ డ్రగ్స్ వినియోగాన్ని నిరుత్సాహపరిచేలా ఓ ప్రచార వీడియోను విడుదల చేశారు. “మన కోసం బ్రతికే మనవాళ్లు ఉన్నారు. ఇలాంటి డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?” అంటూ వీడియోలో స్పష్టమైన సందేశం ఇచ్చారు. జనవరి 1 సందర్భంగా ఈవెంట్స్ జరిగే సందర్భంలో ప్రభాస్ ఈ సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రభాస్ తన సందేశంలో, “లైఫ్‌లో మనకు అవసరమైనదానికంటే ఎక్కువ ఎంజాయ్‌మెంట్ ఉంది. కావాల్సినంత ఎంటర్టైన్‌మెంట్ మనకు లభిస్తోంది. మనల్ని ప్రేమించే మనుషులు మన చుట్టూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?” అంటూ పిలుపునిచ్చారు. ఈ సందేశం వినూత్నంగా యువతను ప్రభావితం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే, ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ (87126 71111)ను ఉపయోగించి డ్రగ్స్ బానిసలైన వారిని గుర్తించి సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ బానిసలుగా మారిన వారు పూర్తిగా కోలుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని వివరించారు.
ఈ సందేశం ద్వారా ప్రభాస్ యువతకు స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేశారు. డ్రగ్స్ వినియోగం కారణంగా జీవితాలను నాశనం చేయకుండా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సామాజిక అంశాల్లో ప్రభాస్ తన పాత్రను మరింత ప్రాముఖ్యంగా చాటుకుంటున్నారు.