గద్వాల అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎల్. సైదా నాయక్, డిగ్రీ పట్టా బద్రులకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం గురించి సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారు. 19 నుండి 55 సంవత్సరాల వయస్సు గల ప్రతి పట్టభద్రుడు తపాలా జీవిత బీమా పాలసీని పొందవచ్చు అని తెలిపారు. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా డిగ్రీ పట్టభద్రులకు కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం 141 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా, అందరికీ ఈ పథకం ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మొదటగా ఆర్మీ వారితో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పట్టభద్రులకు కూడా అందుబాటులోకి వచ్చినట్లుగా వివరించారు.
సాయిది ప్రకారం, డిగ్రీ పట్టభద్రులు మినిమం రూ. 20,000/- నుండి గరిష్టంగా రూ. 50,00,000/- వరకు పాలసీ పొందవచ్చు. ఈ పథకం ద్వారా తక్కువ ప్రీమియం చెల్లించి ఎక్కువ బోనస్ పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనీస విద్యార్హత కలిగిన వారు ఈ పాలసీని 10 లక్షల రూపాయల వరకు పొందగలుగుతారు.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ సహజ సిద్ధమైన మరణాలు మరియు ప్రమాదవశాత్తు మరణాలపై కూడా వర్తిస్తుంది. పూర్తి సమాచారం కోసం సమీపంలోని తపాలా శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.
