ఆదోని డిఎస్పీ D. సోమన్న పర్యవేక్షణలో ఆదోని 3 వ పట్టణ సి.ఐ పి.రామలింగమయ్య మరియు సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆదోని పట్టణములో కొందరు మట్కా నిర్వహిస్తున్నారన్న సమాచారముతో తేదీ 01.11.2024 న ఆదోని 3 టౌన్ పోలీసు స్టేషన్ లో Cr.No.114/2024u/s 112 BNS and 7(a) r/w 8(e) APP Act and Sec 9(1) APG (Matka) Act గా కేసు నమోదు చేసి మున్షి అలీ హుస్సేన్ మరియు K. ఈరప్ప లను అరెస్టు చేసి 15 లీటర్ల నాటు సారాయిని మరియు 35, 500/- రూపాయలను సీజ్ చేయడమైనది. ఈ కేసులో భాగంగానే ఇంకా కొంత మంది ముద్దాయిల గురుంచి రాబడిన సమాచారము మేరకు ఉదయము 10.30 గంటలకు ఆదోని ఆస్పరి బైపాస్ రోడ్డులో MG బ్రదర్స్ వెంచర్ లో బయలు స్థలము వద్ద ఖాళీ స్థలములో ఉండగా.
Y.శ్రీకాంత్ రెడ్డి, వయస్సు 35 సంలు, తండ్రి పేరు వై. నాగిరెడ్డి , H.No.3/14, కమ్మరచేడు గ్రామము, ఆలూరు మండలము, కర్నూలు జిల్లా, ప్రస్తుతము బళ్లారి టౌన్
షేక్ చకోలి చాంద్ బాష , వయస్సు 38 సంలు s/o late షెక్షవాలి , ఇంటి నంబరు 24/96, హవన్న పేట ,ఆదోని టౌన్.
ముద్దాయి Y.శ్రీకాంత్ రెడ్డి సుమారు 15 సంల నుండి బళ్ళారి లో ఉంటూ Sai Refrigeration పేరు మీద refrigeration వర్క్ వ్యాపారము చేసేవాడని కొద్ది సంవత్సరాల నుండి జల్సాలకు అలవాటు పడి చాలాచోట్ల అప్పులు చేసి చేసిన అప్పులు కట్టడానికి ఏదైనా అక్రమంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని ఆ పనిలో భాగంగా మట్కా వ్యాపారము వలన డబ్బులు బాగ సంపాదించుకోవచ్చునని నిర్ణయించుకొని ఇంతకు ముందు ఆదోని లో మట్కా ఆట నిర్వహిస్తున్న ఆలీ హుస్సేన్ , చాంద్ బాష లతో మాట్లాడుకొని వారిని నుండి ప్రతి రోజు మట్కా ఆట నుండి డబ్బుల లావాదేవి లు చేస్తూ అదే విదంగా నాటు సారాయి వ్యాపారము కూడా చేసే చేస్తూ వారితో whatsapp గ్రూప్ ఏర్పాటు చేసి, మట్కా ఆట లావాదేవీలు, రోజు వారి మట్కా ఆట లెక్కలు మరియు మిగతా మట్కా ఆటకు సంబందించిన విషయాలు అన్నీ ఆ whatsapp గ్రూప్ లో discussion చేస్తూ మట్కా నిర్వహిస్తున్నారు. అయితే 01.11.2024 వ తేది అలీ హుస్సేన్ ను మరియు ఈరప్ప లను పట్టుకొని, అలీ హుస్సేన్ నుండి మట్కా డబ్బును మరియు సారాయిను స్వాదీనము చేసుకొని, రిమాండు కు పంపడం జరిగింది. అది తెలుసుకొని ఆ కేసులో ముద్దాయి Y.శ్రీకాంత్ రెడ్డి కోసము మరియు చాంద్ కోసము కూడా వెతుకుతున్నామని అని తెలిసుకొని వీరు లాయరు తో మాట్లాడుకోవాలని గత కొన్ని రోజులుగా మట్కా ద్వారా సపదించిన డబ్బులను తీసుకొని ఈ దినము బళ్ళారి నుండి ఆదోని కి వచ్చి చాంద్ తో కలిసి ఆదోని కొండలలో గుర్తు తెలియని వ్యక్తితో నాటు సారాయి కొనుక్కొని, ఈ సారాను అమ్ముకొని లాయరు తో కలిసి మాట్లాడాలని యిక్కడ ఉండగా పోలీసు వారు పట్టుకోవడమైనది.
ముద్దాయిలను అరెస్టు చేసి, వారి వద్ద మట్కా ద్వారా సంబందించిన డబ్బులు రూ. 2,15,600/- లను మరియు మట్కా ఆడడానికి ఉపయోగించినది సెల్ ఫోన్ grey colour NOKIA కంపెనీ కి చెందిన సెల్ ఫోన్ ను మరియు రెండు క్యాన్ల లో ఉన్న 10 లీటర్ల నాటు సారాయి ని సీజ్ చేయడమైనది.