అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మరొక విమాన ప్రమాదం సంభవించింది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి టేకాఫ్ చేసిన కొన్ని సెకన్లలోనే విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. విమానం ఒక షాపింగ్ మాల్ సమీపంలో కూలిపోయింది, దీంతో కొన్ని భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ విమానం ఈశాన్య ఫిలడెల్ఫియాకు చెందిన విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అయితే టేకాఫ్ చేసిన 30 సెకన్లలోనే విమానం ప్రమాదానికి గురైంది. విమానం భవనంపై పడడంతో చెలరేగిన మంటల్లో అనేక భవనాలు కమ్మబడ్డాయి. ఈ ప్రమాదంలో కొంతమంది గాయపడ్డారు.
ఫిలడెల్ఫియా ఆఫీస్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ ప్రారంభించామని పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో ప్రకటించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరా ద్వారా ఈ సంఘటన మొత్తం రికార్డ్ అయింది. విమానం భవనంపై పడిన తర్వాత అది క్షణాల్లో మంటల బంతిగా మారిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.