ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని నర్సీపట్నం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు.
శుక్రవారం నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి తన నివాసంలో మీడియాతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నంలో మంత్రిగా కంటే ఎమ్మెల్యేగా నేనే ఎక్కువ ఫండ్స్ తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, ఎవరు హాయంలో నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందో, వాటి అభివృద్ధి పనులు పైన ఆయన లెక్కలు వివరించడం జరిగింది.
ముఖ్యంగా గబ్బాడ లో ఉన్న ఇసుకను ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ,టిడిపి నాయకులు మాకు మర్యాద ఇస్తే మేము వారికి మర్యాద ఇస్తామని ఆయన అన్నారు.
అంతేకాకుండా 50 లక్షలతో మంజూరు చేసిన బాక్సింగ్ కోర్టు నిర్మాణం త్వరతగతిన చేపట్టాలని ఆయన సూచించారు.

 
				 
				
			 
				
			 
				
			