రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం విశాఖపట్నం నుండి సాలూరుకు రోడ్డు మార్గం ద్వారా పర్యటించడానికి బయలుదేరారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, ముందుగా నిర్ణయించిన ప్రకారం గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ఆయన నిర్ణయించారు.
సాలూరు మీదుగా పవన్ కళ్యాణ్ గారు మక్కువ మండలానికి, బాగుజోలకు ప్రయాణం చేశారు. ఆయన పర్యటనలో, మన్యం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో 19 నూతన రోడ్లకు శంకుస్థాపన చేశారు.
ఈ రోడ్ల నిర్మాణం దాదాపు 36.71 కోట్ల వ్యయంతో 39.32 కి.మీ మేర ఉంటుందని తెలిపిన పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రాజెక్టు ద్వారా 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి కలుగుతుందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ గారు, సాలూరు నియోజకవర్గంలోని పనసభద్ర పంచాయతీ బాగుజోలకు కూడా పర్యటించి, అక్కడా అభివృద్ధి పనులను ప్రారంభించారు.