జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేరళలోని కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. ఆధ్యాత్మికంగా ప్రాధాన్యమైన ఈ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్‌కు ఆలయ విశేషాలు వివరిస్తూ, ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా ఆయనతో ఉన్నారు. ఆలయ పరిసరాల్లో పవన్ కళ్యాణ్, అకీరా సందడి చేస్తూ భక్తుల అభిమానం పొందారు. పవన్ కళ్యాణ్ ఆలయ దైవ సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేయడం విశేషం.
ఈ కార్యక్రమంలో టిటిడి పాలకమండలి సభ్యుడు శ్రీ ఆనందసాయి కూడా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికింది. ఆలయ పరిరక్షణ, అభివృద్ధిపై ఆయన ఆలయ నిర్వాహకులతో చర్చించినట్లు సమాచారం.
ఈ సందర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మికత, కేరళలోని ఆలయ సందర్శనపై జనసేన అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.