షిరిడి సాయి విద్యానికేతన్ చెముడు లంక గ్రామంలో జరిగిన పదో తరగతి విద్యార్థిని చెక్కపల్లి వెన్నెల ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం సమర్పించడానికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చెక్క పల్లి వెన్నెల తల్లిదండ్రులు….. తిరుగు ప్రయాణంలో వారితో మాట్లాడుతానని న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ గత పది రోజులుగా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే తమకు న్యాయం జరగడం లేదని పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేకూరుస్తారని ఆశతో ఎయిర్ పోర్ట్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతిపత్రం సమర్పించడానికి వచ్చామని అయితే తిరుగు ప్రయాణంలో తమతో మాట్లాడతామని హామీ ఇచ్చారని ఆయన కోసం ఇక్కడ వేచి ఉంటామని తెలిపారు.
విద్యార్థినీ ఆత్మహత్యపై న్యాయం కోరిన తల్లిదండ్రులు
Following the tragic suicide of student Chekkapalli Vennela, her parents approached Deputy CM Pawan Kalyan at Rajahmundry Airport, seeking action against the school management for justice.
