విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయితి గ్రామంలో బుధవారం ఎంపీడీఓ భానుమూర్తి, ఆధ్వర్యంలో పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. పల్లె పండగ కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నాయకుల ప్రతిపాదన మేరకు గ్రామ అవసరార్థం ముందుగా చేయవలసిన పనులు గుర్తించి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పొట్టంగి దుర్గా, మాజీ సర్పంచ్ బెవర వీరు నాయుడు, మాజీ ఎంపిటిసి మన్నెపురి రామచంద్రుడు, వైస్ సర్పంచ్ కలిశెట్టి నారాయణరావు, టిడిపి నాయకులు సతివాడ నారాయణరావు, ఏపీవో చిన్నప్పయ్య,తదితరులు పాల్గొన్నారు.
జయితి గ్రామంలో పల్లె పండగ కార్యక్రమం నిర్వహించారు
The "Palle Pandaga" program in Jayathi village, led by MPDO Bhanumurthy, initiated development projects and called for community engagement in village progress.
