పి.గన్నవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎంపీటీసీలు, సర్పంచులు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈనెల 14వ తేదీ నుండి నిర్వహించనున్న పల్లె వారోత్సవాలలో భాగంగా గ్రామాలలో ఉపాధి హామీ పథకం, పంచాయతీ నిధులతో నూతన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. మాజీ ఎంపీపీ అంబటి భూలక్ష్మి, పి. గన్నవరం సర్పంచ్ బొండాడ నాగమణి, ఎంపీడీవో కె.వి.ప్రసాద్, తహసిల్దార్ పల్లవి, సర్పంచుల సమాఖ్య అధ్యక్షురాలు యర్రంశెట్టి త్రివేణి , ఎంపీటీసీల సమాఖ్య అధ్యక్షుడు ఆదిమూలం సూర్యనారాయణ, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
పి. గన్నవరం సర్వసభ్య సమావేశంలో గ్రామ అభివృద్ధి పై చర్చ
 In the P. Gannavaram Mandal Parishad meeting, MLA Giddi Satyanarayana and MPP Ganishetty Nagalakshmi focused on solving village issues and launching new development projects.
				In the P. Gannavaram Mandal Parishad meeting, MLA Giddi Satyanarayana and MPP Ganishetty Nagalakshmi focused on solving village issues and launching new development projects.
			
 
				
			 
				
			 
				
			