మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “ఓజీ” సినిమా ట్రైలర్ వచ్చేసింది. మేకర్స్ తాజాగా ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తూ ఫ్యాన్స్‌కి పండగ వాతావరణం తీసుకొచ్చారు. కాస్త ఆలస్యం అయినా, క్వాలిటీ కంటెంట్, అద్భుతమైన ఔట్‌పుట్ ఇవ్వడమే తమ లక్ష్యమని, అందుకే ట్రైలర్ విడుదలలో ఆలస్యం జరిగిందని నిర్మాతలు స్పష్టం చేశారు.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్, మరో మూడు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్‌లో పవర్‌ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలు, హై-వోల్టేజ్ డైలాగులు, మెగా హీరో స్టైల్ హైలైట్ అవుతున్నాయి.
ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో ఆకట్టుకోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించారు. అలాగే అర్జున్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. విభిన్నమైన స్టోరీలైన్, స్టైలిష్ ట్రీట్మెంట్, మాస్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌కి వచ్చిన రెస్పాన్స్, ఇప్పుడు ట్రైలర్ క్రేజ్‌తో “ఓజీ” బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వేస్తున్నారు.