మాఘ పౌర్ణమి నేపథ్యంలో అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. ఎమ్మార్వో ఏ శ్రీనివాసరావు, పరవాడ డి.ఎస్.పి విష్ణు స్వరూప్ తీరం వద్ద ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు అనువుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
స్థానిక సీఐ హెచ్. నరసింగరావు మాట్లాడుతూ, మాఘ పౌర్ణమి జాతర సందర్భంగా ఫిబ్రవరి 11న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సముద్ర స్నానాలకు ఏర్పాట్లు చేయాలని, సముద్ర అలల ఉద్ధృతిని గమనించి భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సముద్రంలో కిరటాల ఉధృతంగా ఉన్న కారణంగా భక్తులు ఒడ్డునే ఉండి స్నానం ఆచరించాలని పోలీస్ అధికారులు హెచ్చరించారు. సముద్రంలో లోపలికి వెళ్లడం ప్రమాదకరమని, పోలీసులు ఇచ్చే సూచనలను ఖచ్చితంగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారుల సమావేశంలో నిర్ణయించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. భక్తులు క్రమశిక్షణతో నడుచుకుని, పోలీసుల సూచనలను పాటిస్తే ఎటువంటి ప్రమాదం జరుగదని స్పష్టం చేశారు.
