పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గ్రామంలో వెలిసిన శ్రీ కోట దుర్గ అమ్మవారికి దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వీట్స్ ప్రోప్రైటర్ శ్రీ ఈదుబిల్లి బలరాం స్వామి మరియు శ్రీను దంపతులు అమ్మవారికి అలంకరణ కోసం ఇత్తడి వీణను సమర్పించారు. ఈ వీణను దాతలు ఇంటి వద్ద నుండి మేళతాళాలతో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కోట దుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారికి వీణను బహుకరించడం చాలా ఆనందదాయకమని కొనియారు. అలాగే శ్రీ కోట దుర్గ అమ్మవారి ఆలయకమిటీ సభ్యులు అయిన చిన్నారి రవికుమార్ గారు కిరీటాన్ని బహుకరించారు. వారి ఇంటి వద్ద నుండి మేళతాళాలతో ఆలయం వరకు తీసుకొచ్చి అమ్మవారికి కిరీటాన్ని అలంకరించారు.
కురుపాం గ్రామంలో అమ్మవారికి ఇత్తడి వీణ సమర్పణ
 Presentation of Silver Veena and Crown to Goddess
				Presentation of Silver Veena and Crown to Goddess
			
 
				
			 
				
			 
				
			