ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా బైరు హరినాథ్ బాబు మరియు పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నూతన వ్యవసాయ కమిటీకి శుభాకాంక్షలు తెలియచేశారు. రాబోయే మూడు నెలల్లోనే ఈ మార్కెట్ యార్డ్ నిర్మాణం పూర్తి చేసి, సంక్రాంతికి ప్రారంభం చేస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యాటేంటిలలో 4 గ్యారెంటీ లు పూర్తి చేశామని, రైతులకి రుణ మాఫీ కూడా చేశామని, మిగిలిన రైతులకి కూడ రైతు రుణ మాఫీ చేస్తామని అన్నారు.రాజకీయ లబ్ధి కోసం కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని అన్నారు, గత ప్రభుత్వం లక్ష రుణ మాఫీ చేయడానికి 10 సంవతసరాలు పట్టిందని అన్నారు.రాష్ట్రం మొత్తంలో ప్రతి నియోజక వర్గంలో ఇంటిగ్రీడెడ్ స్కూల్ ప్రారంభించ బోతున్నామని అన్నారు.రాబోయే కొద్ది రోజుల్లోప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు కూడా ఇవ్వబోతుందని, ప్రతి ఇంటికి 5 లక్షలు ఇస్తుందని అన్నారు. ఆనాటి ప్రభుత్వం వారి పదవుల మీద ఉన్న ఆశ ప్రజల మీద లేదని అన్నారు. బావ బావమరిదు లు ఇద్దరు వారి ఇళ్లు పోతాయని హైదరాబాద్ లో మూసి నది వద్ద దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని, రైతుల కోసం 2024 చట్టం ద్వారా ధరణి సరి చేసి పట్టాలు రాని రైతులకి పట్టాదారుపట్టాలు ఇస్తుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికీ మేలు చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పాలేరు నియోజక వర్గానికి గతంలో బై ఎలెక్షన్ లో గెలిచి మూడు సంవత్సరాలలో అభివృద్ధి చేశానని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా శక్తి మేర కృషి చేసి మార్కెట్ అభివృద్ధి చేస్తామని అన్నారు. గోదావరి జలాలను పాలేరు లో కలిపి నియోజక వర్గాన్ని సస్యశ్యామలం చేస్తా మని అన్నారు. నా చిర కాల మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి పాలేరు నియోజక వర్గం అభివృద్ధి చేస్తామని అన్నారు. వచ్చే పంట నుండి సన్న వడ్లకి 500 రూ బోనస్ అధికంగా ఇస్తామని అన్నారు, పంటలకు ఇన్స్యూరెన్స్ చేయిస్తామని, పామాయిల్ సాగు చేస్తే, ఇక్కడే ప్యాక్టేరి పెట్టిస్తామని అన్నారు. ఈ నియోజక వర్గం పచ్చని పొలాలు, ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకుంటన్న అన్నారు. రైతు రుణ మాఫీ చేశామని, రైతులు తల దించుకునే పరిస్థితి రానివ్వమని అన్నారు. ఖమ్మం మార్కెట్ తల దాన్నెలా మధ్ధుల పల్లి మార్కెట్ గా అభివృద్ధి చేస్తామని అన్నారు. పనికి రాని నియోజగ వర్గంగావున్న పాలేరు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశామని ఇంకా అభివృద్ధి చేస్తామని అన్నారు.
