మెగా డాటర్ నిహారిక కొణిదెల నటించిన తాజా సినిమా ‘మద్రాస్ కారన్’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. అయితే, విడుదలైన వెంటనే మిక్స్డ్ టాక్‌ను మూటగట్టుకుంది. దీంతో నిర్మాతలు సినిమాను త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తెచ్చేందుకు సన్నాహాలు చేశారు. షేన్ నిగమ్ హీరోగా, వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై బి. జగదీశ్ నిర్మించారు.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మద్రాస్ కారన్’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. థియేట్రికల్ రన్ అంతగా బలంగా లేకపోవడంతో, నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ప్రేక్షకులకు త్వరగా అందించాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 7న సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.
తాజాగా ఆహా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా ‘మద్రాస్ కారన్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను వెల్లడించింది. తమిళ్ వెర్షన్‌ను ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంది. అయితే తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌పై ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు కూడా ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా ఓటీటీ రిలీజ్‌పై వచ్చిన ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు నిహారికకు మద్దతుగా స్పందిస్తున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన వారు, ఓటీటీలో సినిమా ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఓటీటీలో ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి!
