డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఇకపై ఆర్టీఏ కార్యాలయానికి తిరుగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సరికొత్త ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకునే విధానాన్ని తెలంగాణ రవాణాశాఖ ప్రారంభించింది. దీని ద్వారా దళారుల మోసాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
దరఖాస్తు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ముందుగా రవాణాశాఖ అధికార వెబ్సైట్లోకి వెళ్లి, ‘లైసెన్స్’ ఆప్షన్ను ఎంచుకోవాలి. తర్వాత ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఎంపిక చేసి ‘రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్’పై క్లిక్ చేయాలి. ‘క్లిక్ హియర్ టు బుక్ ది స్లాట్’ అనే ఆప్షన్ ద్వారా తదుపరి పేజీకి వెళ్లాలి.
వచ్చిన పేజీలో డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, జారీచేసిన స్థలం, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేసి ఓటీపీని నమోదు చేయాలి. డీటెయిల్స్ వచ్చిన తర్వాత అవి సరైందో లేదో చూసి కన్ఫాం చేయాలి. ఆపై అందుబాటులో ఉన్న తేదీల్లో మనకు అనుకూలమైన తేదీని ఎంచుకుని ఫీజు చెల్లించాలి.
ఫైనల్గా, స్లాట్ బుక్ చేసిన ప్రింట్, ఒరిజినల్ లైసెన్స్, గుర్తింపు పత్రాలతో ఆర్టీఏ కార్యాలయానికి హాజరైతే, అధికారుల పరిశీలన అనంతరం లైసెన్స్ పునరుద్ధరణ చేయబడుతుంది. ఇలా దరఖాస్తు నుంచి స్లాట్ బుకింగ్ వరకు మొత్తం ప్రక్రియ ఆన్లైన్లో పూర్తవుతుంది.
