కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మి దేవి గార్డెన్ లో భారతీయ కిసాన్ సంఘ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి , ఉపాధ్యక్షులు సాయి రెడ్డి , రాజేష్ మాట్లాడారు మా మీద నమ్మకంతో మాకు భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు , ఉపాధ్యక్షులు కార్యదర్శి ఎన్నుకున్నందున రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నమన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరిగిన వారికి తోడుగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. ఈ నెల అక్టోబర్ 5 తేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే చలో కామారెడ్డి రాష్ట్ర మహాసభ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా పక్షాన తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ముస్కు రమణ రావు , చెరుకు విభాగం లక్ష్మారెడ్డి , మార్కెట్ ఇన్సూరెన్స్ విభాగం ఉప్పు మల్లయ్య , రెవిన్యూ రావు సాబ్ , జలం విభాగం గంగారెడ్డి , విద్యుత్ విభాగం రాజా గౌడ్ , పసిపాలన పున్నం రాములు , కార్యవర్గ సభ్యులు సుద్దాల లింగం , హనుమాన్లు , సుధాకర్ పార్టీ కార్యకర్త నాయకులు పాల్గొన్నారు.
భారతీయ కిసాన్ సంఘ్ కొత్త కార్యవర్గం ఎన్నిక
 The Bharatiya Kisan Sangh elected a new executive committee in Kamareddy, pledging to fight for farmers' rights and organize a grand public meeting on October 5.
				The Bharatiya Kisan Sangh elected a new executive committee in Kamareddy, pledging to fight for farmers' rights and organize a grand public meeting on October 5.
			
 
				
			 
				
			