బాలీవుడ్ భీష్ముడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘సికందర్’ బాక్సాఫీస్ వద్ద వందకోట్లకు పైగా వసూళ్లు సాధించినా, కథనం పరంగా విమర్శలకు గురైంది. ఈ సినిమా నుంచి తొలగించిన ఓ కీలక సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ సీన్‌లో అందాల తార కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, కాజల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడతుంటే, సల్మాన్ పాత్ర ఆమెను రక్షించి, జీవితం విలువ గురించి moving గా బోధిస్తాడు. తన మామగారు, భర్తల నుంచి ఎదుర్కొంటున్న అవమానాలతో విసిగిపోయిన మహిళగా కాజల్ పాత్ర హృదయాన్ని తాకేలా ఉంది. ఈ సీన్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
“ఇంత బలమైన సందేశం ఉన్న సన్నివేశాన్ని ఎందుకు తొలగించారు?” అని పలువురు ప్రశ్నిస్తున్నారు. “ఆత్మహత్యల నివారణపై ఈ సీన్ ఉపయోగపడే అవకాశం ఉంది. అందంగా, ఆలోచింపజేసేలా ఉంది. చిత్ర బృందం ఇటువంటి సందేశాత్మక అంశాన్ని కట్ చేయడం విచారకరం” అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
‘సికందర్’ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా, రష్మిక మందన్న, సత్యరాజ్, శర్మన్ జోషి కీలక పాత్రలు పోషించారు. ఈద్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను ఎదుర్కొన్నప్పటికీ, ఈ తొలగించిన సీన్‌పై ఇప్పటివరకు చిత్ర బృందం స్పందించలేదు.
