అరకు వేలి నియోజకవర్గం డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి మీడియా మిత్రులతో! మాట్లాడుతూ ఐటిడిఏ పాలకవర్గ సమావేశం అంటేనే ఒక మినీ అసెంబ్లీ లాంటిది ప్రతి మూడు నెలలకు ఒకసారి పాలకవర్గ సమావేశం జరపాలి. కానీ గత రాష్ట్ర ప్రభుత్వము గిరిజన సమస్యల పైన విస్మరించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్రంలో ఉన్న ఐటీడీలలో తక్షణమే మినీ అసెంబ్లీ ఐటిడిఏ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి గిరిజనుల సమస్య పరిష్కారం కోసం చర్చలు జరపాలని ప్రధానంగా జి ఓ నెంబర్ 3 చట్టబద్ధత కొరకు గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎంపీ గారు శాసనసభ్యులు జడ్పిటిసిలు ఎంపిటిసిలు మరియుఎంపీపీలు అన్ని రాజకీయ పార్టీలు గిరిజన నాయకులు ద్వారా సమావేశం ఏర్పాటు చేయాలి. ఐదు షెడ్యూల్ భూభాగం 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి? అక్రమ నిర్మాణాలు ఆపాలి? ఐటీడీఏ పరిధిలో పూర్తిస్థాయి ఉద్యోగ నియామకాలు గిరిజనుల ద్వారా చేపట్టాలి రాష్ట్ర గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లను రెవెన్యూ వాల్ చేయాలి. తొలి సంతకం అమలు చేయాలి అదేవిధంగా బోయ వాల్మీకి గిరిజనేత్రులను గిరిజన జాబితాలో చేర్పించడానికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని ఐటీడీఏల్లో పూర్తిస్థాయి డిప్యూటీ డైరెక్టర్లను నియమించాలని. ఈ సమస్యల పైన గిరిజన కూటమి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు స్పందించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మిడిశెట్టి గాసన్న. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
