రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు పదోన్నతులు, గుర్తింపు ఇవ్వాలని సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించారు. పార్టీకి సేవ చేస్తున్న వారికి ప్రాధాన్యత కల్పిస్తూ, పార్టీ బలోపేతం కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదోని నియోజకవర్గానికి వైయస్సార్సీపి ప్రచార బాధ్యతలను పరిగెల నారాయణకు అప్పగిస్తూ పార్టీ నూతన కార్యాచరణను అమలు చేశారు.
పరిగెల నారాయణకు వైయస్సార్సీపి ప్రచార బాధ్యతలను అప్పగించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు ఇస్తూ నూతన బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. ప్రజల్లో పార్టీ విజయం సాధించేందుకు కార్యకర్తల సహకారం ఎంతో అవసరమని, ఈ నియామకం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందన్నారు.
ప్రచార బాధ్యతలు స్వీకరించిన పరిగెల నారాయణ మీడియాతో మాట్లాడుతూ, తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. పార్టీ అభివృద్ధి, మనుగడ కోసం కష్టపడి పని చేస్తానని, కార్యకర్తల సహకారంతో పార్టీ విజయాన్ని ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు ఇది ప్రోత్సాహకమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అధినేత జగన్‌మోహన్ రెడ్డి పిలుపుమేరకు, పార్టీ బలోపేతానికి నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు పూర్తి స్థాయిలో సమర్ధంగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు.

 
				 
				
			 
				
			 
				
			