అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండల కేంద్రంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీ, సీఎం రమేష్ ,ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఈ నియోజకవర్గంలోనే ఉండి రాష్ట్రంలో నే వెనుక బడిఉన్న ఈ నియోజకవర్గానికి ఏమి పనులు చేశాడు, నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి లేకపోవడం వలన తండ్రి, కూతురు ,ఇద్దరని ఈ నియోజకవర్గ ప్రజలు ఇంటికి పంపించారు. ఈ ప్రభుత్వం లో ఉన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం అభివృద్ధి కి, 30, కోట్ల రూపాయలు మంజూరు చేసారు. గత ప్రభుత్వం లో ఉన్న మాజి సియమ్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ దారి మల్లించి తన సొంత పనులకు వినియోగించు కున్నాడని కాని పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి రాష్ట్ర అభివృద్ధి కి 4500, కోట్ల రూపాయలు నిదులు తీసుకు వచ్చి ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని సదుద్దేశంతో నిధులు మంజూరు చేసారని అన్నారు.
మాడుగుల పల్లె పండుగలో ఎంపీ సీఎం రమేష్ అభివృద్ధి ప్రతిపాదనలు
At the Madugula village festival, MP CM Ramesh highlighted past and current efforts for the constituency’s development, emphasizing funds granted by Pawan Kalyan.
