తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా టిడిపి సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో, జిల్లా టిడిపి అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో టిడిపి కార్యకర్తల పాత్ర, పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, కార్యకర్తల సంక్షేమంపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని, కార్యకర్తల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం కార్యకర్తలకు మరింత ప్రాధాన్యతనిచ్చి, నామినేటెడ్ పదవులను అందజేసిందని తెలిపారు. తన ఎంపీ లాడ్స్ నిధులను సమానంగా పంపిణీ చేసి ప్రజలకు మేలు చేయాలని సంకల్పించానని స్పష్టం చేశారు.
తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ప్రతినిధులను నియమించి, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎంపీ ప్రకటించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ విధానాలను దగ్గర చేసి, వారి సంక్షేమం కోసం నిత్యం కృషి చేస్తానని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించాలన్న లక్ష్యానికి అందరి సహకారం అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, కొండ్రు మురళీమోహన్, అతిథి విజయలక్ష్మి, కోళ్ల లలిత, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. విజయనగరం టిడిపి భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించి, పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.
