ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 16 ఏళ్ల ఈ తేనె కళ్ల సుందరి ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. ఆమె అందాన్ని చూసి ఫొటోలు, వీడియోలు తీశారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగిపోతోంది.
ఆమె క్రేజ్ చూస్తే బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడం ఖాయం అనిపించింది. అలా దర్శకుడు సనోజ్ మిశ్రా తన సినిమాకి మోనాలిసాను ఎంపిక చేశారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే చిత్రంలో నటించే అవకాశం ఆమెను వరించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఆమె సంతకం కూడా చేసింది.
ఈ చిత్రానికి మోనాలిసా భోస్లే రూ. 21 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా, స్థానికంగా కొన్ని వ్యాపార ప్రమోషన్ల కోసం కూడా రూ. 15 లక్షల ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. కుంభమేళాకు వెళ్లిన ఆమె ఇప్పుడు బాలీవుడ్‌లో నటి అవ్వడం అద్భుతమనే చెప్పాలి.
ఇంతకు ముందు పూసలు అమ్ముకుంటూ రోజుకు రూ. 1000 సంపాదించిన మోనాలిసా, ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నదని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణ అమ్మాయి ఇలా ఒక్కరోజులో స్టార్‌గా మారడం నిజమైన అదృష్టమంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.