ఉన్నత పాఠశాలల పనివేళలను మార్చాలనే ఆలోచన ఉపసంహరించు కోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఈరోజు శాసన మండలి సమావేశంలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి :-
ఉన్నత పాఠశాలల పనివేళలను ప్రస్తుతం నిర్వహిస్తున్న 09-00 AM నుండి 04-00 PM కు బదులు గా క్రొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే 09-00 AM నుండి 05-00 PM వరకు పెంచుతూ నిర్ణయించి, అమలుకు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. పాఠశాలల పని వేళలు ఇలా మార్చాలంటే విద్యార్థుల మానసిక స్థితి, అలానే సాయంత్రం 5 గంటల పైన సరైన రవాణా సౌకర్యం గురించి, బాలికలకు భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం గురించి, మహిళా ఉపాధ్యాయుల సమస్యల గురించి, ప్రధానంగా విద్యార్థి తరగతి గదిలో ఎంత సమయం శ్రద్ధగా అభ్యసన జరిపే అవకాశం ఉన్నది అన్న అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.
దీనిపై విద్యావేత్తలు, మానసిక వేత్తలు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాల తో పాటు వివిధ రాష్ట్రాలలో అమలౌతున్న పని గంటలను పరిశీలించిన తరువాత మనము తీసుకున్న నిర్ణయం అంటే పాఠశాలల పనివేళలు 9 AM to 5 PM అన్నది గ్రౌండ్ లెవెల్ లో చాలా సమస్యలకు దారి తీసే అవకాశం ఉన్నది కావున ప్రస్తుతం అమలు అవుతున్న పాఠశాలల పని వేళలను మార్చకుండా యథాతథంగా 9 AM TO 4 PM గా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పది రోజులలోపు పనివేళల మార్పు ఉత్తర్వులను ఉపసంహరించుకునేందుకు సిద్దపడుతున్న ప్రభుత్వం….
.
దీనికంటే ముందుగా మేనిఫెస్టో లో తెలియచేసిన ప్రకారం ప్రభుత్వం నుంచి కనీసం 25 % IR ను, PF, apgli, సరెండర్ లీవు బకాయిలను,, DA ARREARS, PRC arrears లను వెంటనే విడుదల చేసి ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగుల కు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ..
