ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీడియా సమావేశం

MLA Yashaswini Reddy called for a successful public governance celebration in Warangal. She highlighted the Congress government’s achievements in its first year. MLA Yashaswini Reddy called for a successful public governance celebration in Warangal. She highlighted the Congress government’s achievements in its first year.

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేపు వరంగల్ లో, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే ప్రజా పాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల గృహ జ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 5 లక్షలు నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటికీ గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు కనిపిస్తున్నాయన్నారు. లగిచర్ల ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే కుట్రపూరితంగా ప్రతిపక్షాలు అధికారులపై దాడులు చేస్తున్నారన్నారు. ప్రజా పాలనలో దాడులకు తావు లేదన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, పాలకుర్తి దేవర్పుల కొడకండ్ల మండలాల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, ధరావత్ సురేష్ నాయక్, నల్ల శ్రీరామ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగు కృష్ణమూర్తి, ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి తాజా మాజీ సర్పంచ్ యకాంతరావు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *