పెద్దపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో గురువారం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప గారు, మార్కెట్ అధికారులతో మరియు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు గారు..
ఈ సందర్బంగా గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ…
నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ధాన్యం కోతలు అనే పదానికీ తావు ఇవ్వనని స్పష్టం చేశారు. ప్రస్తుత సీజన్ వడ్లను కొనుగోలు సందర్భంగా ఎక్కడైనా కటింగ్ చేస్తే తాను అక్కడికి వచ్చి వాలతానని, సన్న రకాల ధాన్యానికి క్వింటాలకు రూ.500 బోనస్ చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్ల కటింగ్ పేరున కట్ చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని గౌరవ ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. సన్న రకం వడ్ల విషయంలో ఎలాంటి సందేహాలకు తావివ్వకూడదని, పరిమితం లేకుండా ఎన్ని క్వింటాళ్ల సన్న వడ్లు అమ్మినప్పటికీ అమ్మిన మొత్తానికి వారికి బోనస్ చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో రుణమాఫీ చేయని బీఆర్ఎస్ పార్టీ నేతలు రైతుల్లో కావాలని అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు ఏమాత్రం అన్యాయం జరగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, రైతు ప్రభుత్వంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఏమాత్రం అన్యాయం జరిగిన తాను ముందుండి రైతుల పక్షాన నిలబడతానని భరోసా ఇచ్చారు.
అనంతరం గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ వారి 21వ అఖిల భారత పశుగనన తెలంగాణ వారి వాల్ పోస్టర్ ను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అధికారులు మరియు పట్టణ కౌన్సీలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు మరియు రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			