పార్వతీపురం పట్టణంలోని వివేకానంద కాలనీ తారకరామ కాలనీ వీధిలో బాల గణపతి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దల ఆహ్వానం మేరకు పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఆలయ ప్రతిష్ట అనంతరం భక్తులకు దీవెనలు అందజేశారు.
ఎమ్మెల్యే విజయ్ చంద్రకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించగా, ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్వయంగా భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు పాల్గొని ఆలయ ఉత్సవాన్ని విజయవంతం చేశారు. భక్తులు MLA విజయ్ చంద్రను కలసి, ఆలయ అభివృద్ధిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
