ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “పల్లె పండుగ” కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గo బాడంగి మండలం “గజరాయునివలస” గ్రామంలో ఈరోజు ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్షుం నాయుడు గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని, బాడంగి మండలానికి గాను రూ6,61,30,000/- మంజూరైనట్లు తెలిపారు..అలాగే, పెద్దగెడ్డ నీరు ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి లబ్ధి చేకూరే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు శ్తెంటు రవి , మాజీ ఎంపీపీ బొంతు త్రినాథ , సింగిరెడ్డి భాస్కరరావు, లచ్చుపతుల సత్యం , సర్పంచ్ మూడడ్ల సత్యం , ఎంపీటీసీ శ్రీ పాలవలస గౌరు , ఎంపీడీవో , పంచాయితీరాజ్ డీఈ మరియు జేఈ గారు పాల్గొన్నారు.