ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ క్రమంలో రోగులకు సరైన ఆహారం అందించడం లేదని గుర్తించిన ఎమ్మెల్యే సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సరైన డైట్ ఇవ్వకపోతే రోగులు ఎలా కోలుకుంటారని ప్రశ్నించారు.అదేవిధంగా హాస్పటల్ కు వచ్చే రోగుల పట్ల సిబ్బంది మర్యాదగా ప్రవర్తించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అంతకుముందు ఆసుపత్రిలోని రికార్డులను తనిఖీ చేశారు.ఆరోగ్య మిత్ర సిబ్బంది విధులకు హాజరు కాకుండా తప్పుడు సంతకాలు పెడుతున్నట్లు గుర్తించి వారిని మందలించారు..
మట్టా రాగమయి ఆసుపత్రి తనిఖీ, సిబ్బందికి హెచ్చరిక
 MLA Matta Ragamayi inspected the government hospital in Sathupalli, raised concerns over food quality and staff behavior, and warned strict action.
				MLA Matta Ragamayi inspected the government hospital in Sathupalli, raised concerns over food quality and staff behavior, and warned strict action.
			
 
				
			 
				
			