భీమిలి అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంతమందికి టోకెన్లు ఇస్తున్నారు, భోజనం నాణ్యత ఎలా ఉంది, ఏమైనా లోపాలున్నాయా వంటి వివరాలను నిర్వాహక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అందరితో పాటు కలిసి భోజనం చేశారు. భోజనం రుచి ఉందని, పరిసరాల పరిశుభ్రత కూడా బాగుందని ఈ సందర్భంగా గంటా పేర్కొన్నారు. భోజనం కోసం వచ్చిన వాళ్ళతో కొంత సేపు ముచ్చటించారు. అన్నా క్యాంటీన్ లో వడ్డిస్తున్న భోజనం పట్ల వారందరూ సంతృప్తి వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ లలో భోజనానికి ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేదవాడికి రూ.5 కే కడుపు నిండా మంచి భోజనం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారందరూ ప్రశంసించారు.
భీమిలి అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంటా
