ఝార్ఖండ్ రాష్ట్రంలోని నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించిన ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. బహిరంగ సభలో పాల్గొన్న ఆయనకు జేబుదొంగల చేతివాటం పాలు అయింది. ఆయన జేబులో ఉండాల్సిన పర్సు మాయమవడంతో ఆశ్చర్యపోయిన మిథున్ ఈ విషయాన్ని సభ నిర్వాహకులకు తెలియజేశారు.
తన పర్సు పోయిందని తెలిసిన వెంటనే సభ నిర్వాహకులు మైక్ లో పలుమార్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “మిథున్ చక్రవర్తి పర్సు ఎవరు తీసుకున్నారో దయచేసి తిరిగి ఇవ్వండి” అంటూ పిలుపునిచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనతో మిథున్ చక్రవర్తి నిరాశ చెందారు.
పర్సు తిరిగి దొరకకపోవడంతో నిరాశతో మిథున్ చక్రవర్తి నిర్ణీత సమయానికి ముందుగానే సభను వీడారు. ఈ ఘటన అతని ప్రసంగానికి అంతరాయం కలిగించి, స్థానికుల మధ్య సంచలనం సృష్టించింది.

 
				 
				
			 
				
			 
				
			