కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా సమావేశం. ఏర్పాటుచేసి..ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ వన సమారాధన ఆత్మీయ సమ్మేళనంకు అధిక సంఖ్యలో వచ్చిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
యువత కూడా నేను ఇచ్చిన పిలుపు మేరకు సమన్వయం తో ఎటువంటి ఆర్భాటాలు చేయకుండా వచ్చి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయా సంఘటనలు చోటు చేసుకోకుండా,ట్రాఫిక్ స్తంభించకుండా విధులు నిర్వహించిన పోలీసు శాఖ వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపారు..వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ అమలాపురంలో నిర్వహించిన ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ వన సమారాధన సంగీయులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఎటువంటి సమస్య లేకుండా ఎస్.ఎ.ఎఫ్ బృందాలకు,పలు గ్రామాల టిమ్ లకు సత్యం అభినంద నలు తెలిపారు.ఈ సమావేశం లో దొంగ శ్రీను, రాయుడు శత్రుషి, జగదీష్,చొల్లంగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			 
				
			