మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులమీదుగా ‘LYF’ టీజర్ విడుదల

శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్న ‘LYF’ చిత్రం మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమవుతోంది. కిషోర్ రాటి, మహేష్ రాటి, ఏ. రామస్వామి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.పి. చరణ్, ప్రవీణ్, భద్రం, నవాబ్ షా, షకలక శంకర్, రవిబాబు, రియా, సంధ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “శ్రీహర్ష, కషిక కపూర్ యువ జంటగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలి” అని ఆకాంక్షించారు. చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్‌లో మంచి కంటెంట్‌తో రావడం అభినందనీయమని, ఇటువంటి చిత్రాలకు ప్రోత్సాహం అందిస్తానని తెలిపారు.

తక్కువ బడ్జెట్‌లో మంచి కంటెంట్‌తో తెరకెక్కుతున్న ‘LYF’ ఓటీటీ, థియేటర్ ఇలా అన్ని వేదికలపై ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. పెద్ద సినిమాల పోటీలో చిన్న చిత్రాలు నిలదొక్కుకునే విధంగా ప్రేక్షకుల మద్దతు అవసరమని, ఈ చిత్రం అదే రీతిలో విజయాన్ని సాధిస్తుందని మంత్రివర్యులు పేర్కొన్నారు.

ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ, కార్తీక్ క్రౌడర్ యాక్షన్, ఆర్.కె ఎడిటింగ్, మోయిన్ కొరియోగ్రఫీ, చిడిపల్లి శంకర్ ఆర్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. పి.ఆర్.ఓ మధు VR పర్యవేక్షణలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *