కర్లపాలెం యూనియన్ బ్యాంక్ మేనేజర్ కె. మానస ఆధ్వర్యంలో బ్యాంకు ఆవరణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మేనేజర్ మానస ప్రారంభించి, రక్తదానం యొక్క ప్రాధాన్యంపై వివరించారు. రక్తదానం వలన ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, అది మరొకరికి ప్రాణం పోసే మహాదానమని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమం బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జరిగింది. కార్యక్రమంలో సుమారు 50 మంది పాల్గొన్నారు. రక్తదాతలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఇది ఒక వ్యక్తి బాధ్యతను తెలియజేస్తుందని, సమాజానికి సేవ చేసేందుకు చక్కని ఉదాహరణగా నిలుస్తుందని మేనేజర్ మానస అభిప్రాయపడ్డారు.
రక్తదాన కార్యక్రమంలో ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎం.ఎం. భాస్కరరావు, బ్యాంక్ సిబ్బంది జగదీష్, రాజమోహన్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు వాణి, రమణబాబు పాల్గొన్నారు. కర్లపాలెం రెడ్ క్రాస్ చైర్మన్ ఈ. పోలీసు రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, రక్తదానం ప్రాధాన్యతను వివరించారు.
ఈ కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించడంలో బ్యాంక్ సిబ్బంది, రెడ్ క్రాస్ సభ్యుల కృషి ప్రశంసనీయమని మేనేజర్ మానస తెలిపారు. రక్తదానం చేసి సమాజానికి సేవ చేసిన ప్రతి రక్తదాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.