చదువుతోనే బంగారు భవిష్యత్ అని శ్రీకాకుళం డిఎస్పీ సి.హెచ్ వివేకానంద ఆదివారం అన్నారు. నగరంలోని ఎల్ఐసి కార్యాలయం ప్రక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళాడిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో డ్రగ్స్, టొబాకో వంటి మాదక ద్రవ్యాలు వలన కలిగే దృష్ప్రభావాలు కోసం అరసవిల్లి కూడలి నుండి సూర్యమహల్ వివేకానంద విగ్రహ కూడలి వరకు మాదక ద్రవ్యాలు పై వ్యతిరేక నినాదాలతో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని డిఎస్పీ సి.హెచ్ వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ నేటి యువత డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని, ఉజ్వల భవిష్యత్ ను కాపాడుకోవాలని, త్వరలోనే ప్రతీ కళాశాలలతో పాటు, ముఖ్య కూడలిలో డ్రాప్ బాక్స్ లు పెడతామని వీటిని ఉపయోగించి దైర్యంగా పిర్యాదు చేయచ్చని అన్నారు. వన్ టౌన్ సిఐ పైడాపు నాయుడు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలు పై అవగాహన కలిగి ఉండాలని, ఇలా విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి,ప్రిన్సిపాల్ కె.శివశంకర్ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాల బారినపడకుండా భావితరాలకు మార్గదర్శకాలగ నిలవాలని, మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్ములించాలంటే విద్యార్థులే ముఖ్య భూమిక పోచించాలన్నారు. ఎన్ఎస్ఎస్ విభాగాధిపతి ఎల్ మోహనరావు మాట్లాడుతూ యువత చెడు అలవాటులకు దూరంగా ఉంటూ జీవిత గమ్యంను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కె.వేణు, పైడి రాజు, కళాశాల విద్యార్థినిలు, సంస్థ సభ్యులు, స్థానిక యువత పాల్గొన్నారు.