ఈరోజు పాడేరులో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఘననివాళులు . ఈ సందర్భంగా అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించారు. ప్రజల రక్షణకై నిరంతరం కృషి చేసి ఎందరో సంఘవిద్రోహ శక్తులు చేతిలో అమరులవుతున్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం వాళ్ళ ప్రాణాలు ఫలంగా పెట్టి అమరులైన పోలీస్ కుటుంబాలకు జిల్లా ఎస్పీ అమిత్ బద్వార్ ఆధ్వర్యంలో కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేసి అన్ని విధాల వాళ్ల కుటుంబాలను ఆదుకుంటామని కలెక్టర్ ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అల్లూరు జిల్లా పోలీసు సూపర్డెంట్ అమిత్ బద్వార్ తో సహా పోలీస్ అధికారులు అమరులైన పోలీస్ కుటుంబాలు పాల్గొన్నాయి
పాడేరులో అమరవీరుల సంస్మరణ దినోత్సవం
In Paderu, a Martyrs' Remembrance Day event honored fallen police heroes. Collector Dinesh Kumar and SP Amit Badwar participated, emphasizing their sacrifices.
