మంచు మనోజ్ తన జీవితంలో ఎదుర్కొన్న వివక్షను తాజాగా వెల్లడించాడు. తన పెద్ద కోడలు విష్ణుకి కుటుంబం అనవసరంగా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, అన్ని ఆదాయ వనరులను అతని సినిమాల కోసం ఖర్చు చేయడం తనను తీవ్రంగా బాధపెట్టిందని చెబుతున్నాడు. స్కూల్, కాలేజ్ ఆదాయాలను విష్ణు సినిమాలకు ఖర్చు చేయడం చూసినా, ఏ రోజు తన తండ్రిని ఈ విషయం గురించి ప్రశ్నించలేదని మనోజ్ పేర్కొన్నాడు.
తన తల్లి సైతం విష్ణు, లక్ష్మిలపై ఎక్కువ ప్రేమ చూపించినప్పటికీ, తన తల్లి తనకు సొంతమే అని భావించి తన బాధలను ఎప్పుడూ బయట పెట్టలేదని మనోజ్ అంటున్నాడు. తన సొంత సినిమాల కోసం ఇతర ప్రొడ్యూసర్స్ తో పని చేసిన మనోజ్, విష్ణు సినిమాల మాదిరిగా నష్టాలు కాకుండా లాభాలు తీసుకొచ్చాడు. కానీ టాలీవుడ్ లో తన కెరీర్ మెరుగుపరుచుకునే అవకాశం తండ్రి నుంచి అందకపోవడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నాడు.
గత కొన్ని సంవత్సరాలుగా విష్ణు తీసుకున్న ఆగడలు మనోజ్ భరించలేని స్థాయికి చేరాయని చెప్పారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు, కొత్త రూల్స్ పేరుతో విద్యార్థులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం చూసి ప్రశ్నించడంతో గొడవలు మొదలయ్యాయి. విష్ణు ప్లాప్ సినిమాల కోసం విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేయడంపై నిలదీయడం వల్ల విష్ణు తన తండ్రిని మనోజ్ మీదకు ఉసిగొలిపాడని మనోజ్ వెల్లడించాడు.
విష్ణు నిజ స్వరూపాన్ని బయట పెట్టే ప్రయత్నం విఫలమై, చివరకు తన తండ్రి చేత దెబ్బలు తినవలసి వచ్చిందని మనోజ్ చెప్పారు. ఈ సంఘటనల వల్ల తండ్రితో సంబంధాలు దెబ్బతిన్నాయని, కుటుంబానికి తన నమ్మకం తగ్గిపోయిందని వివరించాడు. ఈ నిజం ప్రజలు స్వయంగా తెలుసుకోవాలని కోరుతున్నాడు మనోజ్.