ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన పర్చూరు లో చోటు చేసుకుంది .ఎస్ ఐ మాల్యాద్రి తెలిపిన సమాచారం మేరకు చీరాల నుండి పర్చూరు వచ్చే క్రమం లో తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్ నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జి సప్టా లో పడి మృతి చెందారు అని వివరించారు.ఇతను గణపవరం మండలం నాదెండ్ల గ్రామానికి చెందిన జంపని ప్రసాద్ గా గుర్తించామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమారటం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాల కు తరలించామని అన్నారు.రోడ్ ప్రమాద సూచికలు లేనందున ఇలా జరిగింది అని పలువురు ఆరోపించారు. ప్రమాద సూచికల బోర్డ్ లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నియింత్రించాలని ప్రజలు కోరారు.
పర్చూరు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
A motorcyclist from Nadendla village lost control near Parchur, falling into a bridge pit under construction, raising safety concerns.
