అమెరికా పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన లోకేశ్, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలను ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవకాశాలు ఉండే విధంగా సీఎం చంద్రబాబు విజన్‌ను ఆవిష్కరించారు.
ఈ పర్యటన ప్రధాన లక్ష్యం, గత ఐదేళ్ల విధ్వంసక పాలనతో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడం. పరిశ్రమలు, పెట్టుబడులు మరింత పెంచేందుకు లోకేశ్ ప్రతిపాదనలు ప్రోత్సహించడంలో దిగ్గజ కంపెనీల ప్రతినిధుల నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త ఆశలని కలిగించగలిగారు.
ముఖ్యంగా, ఈ సమావేశాల్లోని పాజిటివ్ స్ఫూర్తితో జనవరిలో దావోస్‌లో జరగబోయే పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని పరిశ్రమలు అంచనా వేస్తున్నాయి.

 
				 
				
			 
				
			 
				
			